'వరి కొయ్యలను కాల్చవద్దు.. రైతులకు సూచన'

'వరి కొయ్యలను కాల్చవద్దు.. రైతులకు సూచన'

NLG: నేల దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల వ్యవసాయ అధికారి గిరిబాబు శుక్రవారం ఆకిటి సత్తిరెడ్డి పొలం వద్దకు వెళ్లి నేలను కాపాడుకోవాల్సిన అవశ్యకతను వివరించారు. ముఖ్యంగా రైతు సోదరులు వరి కోతల తర్వాత పొలములో మిగిలిన వరి కొయ్యలను తగలబెట్టవద్దని తెలిపారు. కొయ్యలతో నేలను తడిపి దున్నడం ద్వారా భూసారం పెరుగుతుందని అవగాహన కల్పించారు.