అమరావతిపై వైసీపీ నేతల దొంగ నాటకాలు: మంత్రి

AP: రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ విషయంలో మూడు ముక్కలాట ఆడిన జగన్‌ను ప్రజలు చీదరించుకున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం అక్కర్లేదంటూనే గుంటూరు, విజయవాడ మధ్య నిర్మిస్తామని కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన గోడ మీద పిల్లి వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.