IAF విన్యాసాలతో శత్రువులకు నిద్రలేని రాత్రులు: CM
ఈశాన్య భారత్‌లో వాయుసేన మొట్టమొదటి పూర్తి స్థాయి వైమానిక ప్రదర్శన చేసింది. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. చికెన్ నెక్, నాలుగు అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరగా నిర్వహించిన ఈ విన్యాసాలు... దేశం లోపల, వెలుపల ఉన్న శత్రువులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తాయని అన్నారు. ఈ విన్యాసాలతో మన వైమానిక దళ పరాక్రమం ప్రపంచానికి తెలిసిందని తెలిపారు.