చిన్నపిల్లలతో డ్యాన్స్ చేసిన BRS జిల్లా అధ్యక్షురాలు
BHPL: భూపాలపల్లి మంజూరునగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పల్లకి సేవను రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువీది ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BRS జిల్లా అధ్యక్షురాలు జ్యోతి పాల్గొని చిన్నపిల్లలతో భక్తి పాటలకు డాన్స్ చేస్తూ సందడి చేశారు.