సెల్ ఫోన్లను తిరిగి అప్పగించిన ఎస్సై
GDWL: మల్దకల్ మండలానికి చెందిన బోయ హనుమంతు (నేతువానిపల్లి), గౌళ్ల రమేష్ (మద్దెలబండ) కొన్ని నెలల క్రితం పోగొట్టుకున్న తమ సెల్‌ఫోన్లపై మల్దకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై నందీకర్ కేసు దర్యాప్తు చేపట్టి, కానిస్టేబుల్ విజయరాజు ద్వారా సిగ్నల్‌ను ట్రేస్ చేయించి సోమవారం బాధితులకు అందజేశారు. ఫోన్లు పోయిన వెంటనే PSలో కంప్లైంట్ ఇవ్వాలని తెలిపారు.