కేజీబీవీని తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి
KMM: కామేపల్లి మండలంలోని పాత లింగాల కేజీబీవీని మండల ప్రత్యేక అధికారి ఎం.వి. మధుసూదన్ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను, మెనూ అమలును ఆయన స్వయంగా పరిశీలించారు. వంటగది, నిల్వ ఉన్న సామగ్రిని తనిఖీ చేసి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.