లబ్ధిదారుల సంక్షేమమే మా ధ్యేయం: వసంత
NTR: మైలవరం నియోజకవర్గంలో 42,045 లబ్ధిదారులకు రూ.18.13 కోట్ల పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. జి.కొండూరు, వెలగలేరు గ్రామాల్లో సోమవారం పింఛన్లు అందజేసిన ఆయన, పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర వర్గాలకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు సాయం అందుతున్నదని చెప్పారు.