అవనిగడ్డలో ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి
కృష్ణా: అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గురువారం స్థానిక వంతెన సెంటరులో కృష్ణారావు విగ్రహానికి అవనిగడ్డ మండలం బందలాయిచెరువు గ్రామం నుంచి కూటమి నాయకులు నివాళులు అర్పించారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీల ప్రతినిధులు, మండలి అభిమానులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.