'అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారు'
VZM: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడంపై రాజం MLA కొండ్రు మురళీమోహన్ హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా తన నివాసంలో సతీసమేతంగా దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేసారు. అయన మాట్లాడుతూ.. ఇది రైతుల త్యాగాలతో సాధించుకున్న ప్రజా విజయమని, ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. CM చంద్రబాబు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారన్నారు.