నేడు శ్రీబండ్ల అమ్మవారి జయంతి ఉత్సవాలు

నేడు శ్రీబండ్ల అమ్మవారి జయంతి ఉత్సవాలు

BPT: చందోలులో శ్రీబండ్ల అమ్మవారి జయంతి ఉత్సవాలు ఇవాళ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. 116 కలశాలతో పంచామృతాలతో అభిషేకం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.