'చిలకలూరిపేటలో 64,511 వేల సంతకాలు సేకరించాం'
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి 64,511 వేలు సంతకాలు సేకరించినట్లు మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా 17 మెడికల్ కళాశాలను ప్రవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.