వీర్నపల్లికి చేరిన సీతారామచంద్ర స్వామి నూతన రథం
SRCL: వీర్నపల్లి (M) కేంద్రంలోని శ్రీ కళ్యాణ సీతారామచంద్ర స్వామి వారి నూతన రథం నిన్న గ్రామానికి చేరుకుంది. రానున్న శ్రీరామనవమి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ రథం రాకతో మండల కేంద్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టారు.