'రైతులకు రుణ మాఫీ చేయాలి'
SKLM: పట్టణంలో ఉన్న సీఐటీయు కార్యాలయంలో శుక్రవారం సంయుక్త కిషన్ మోర్చా సంఘం నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను పోరాటాల ద్వారా ఎన్నో సాధించగలిగామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.