సెప్టెంబర్ 9న తిరుమల నంబి అవతారోత్సవాలు

CTR: ప్రముఖ శ్రీ వైష్ణవ భక్తుడు శ్రీ తిరుమల నంబి 1051వ అవతరోత్సవాలు సెప్టెంబర్ 9న తిరుమలలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9:30 గంటల నుంచి తిరుమల దక్షిణ మాడవీధిలో వెలసిన తిరుమల నంబి ఆలయంలో శ్రీ నంబి జీవన విధానం, వారి రచనలపై బహుముఖ పండితులు ఉపన్యాసాలు ఇస్తారని నిర్వహకులు తెలిపారు. తిరుమల తొలి పౌరుడిగా తిరుమలనంబి నిలిచారని ప్రతీతి.