వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాజీవ్ పాలడుగు

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాజీవ్ పాలడుగు

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడుకు చెందిన పాలడుగు రాజీవ్‌ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకం ఉంచి సంయుక్త కార్యదర్శిగా అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పాలడుగు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.