కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
KNR: కమలాపూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 60 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను శనివారం పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రాణి, సర్పంచ్ పబ్బు సతీష్, ఉపసర్పంచ్ పుల్ల శ్రీనివాస్, వార్డ్ సభ్యులు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.