నేరడిగొండలో చలివేంద్రం ప్రారంభం
ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలం నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా దీన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాబ్లే సంతోష్, సర్పంచ్ ఏలేటి నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబీ సింగ్, రితీష్, రాజేశ్వర్, భావసింగ్, నాందేవ్, తదితరులున్నారు.