రాష్ట్రంలో త్వరలో మరో రెండు కొత్త పథకాలు?
TG: ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన, హైడ్రా పనితీరుపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో అమలు చేయబోయే మరో రెండు కొత్త పథకాలు, కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నాయి.