VIDEO: విద్యార్థుల కళ్ళలో కారం కొట్టిన ఉపాధ్యాయుడు

NZB: నందిపేట్ మండలంలోని కుద్వాన్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు శంకర్ ఇద్దరు విద్యార్థులు అల్లరి చేస్తున్నారని వారి కళ్లలో కారం కొట్టి, తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, గ్రామస్తులు నిలదీయగా ఉపాధ్యాయుడు పారిపోయాడు. ఉపాధ్యాయుడు శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.