ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్‌లు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్‌లు

ADB: జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఇంద్రవెల్లి మండలానికి చెందిన అమర్ సింగ్ తిలావాత్ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. జమునా నాయక్ ధనోరా సర్పంచ్‌గా గెలవగా.. ఆమె తోడికోడలు రోమా శంకర్ గూడకు, చిన్నమామ కుమారుడు జాదవ్ లఖన్ ఎమానుకుంటకు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పదవులు దక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది.