'ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత'
KKD: ప్రధాని మోదీ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర మేధావుల సంఘం కన్వీనర్ డా. ముత్తా నవీన్ కృష్ణ అన్నారు. ఆదివారం కాకినాడలో మోదీ 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలతో మమేకం కావాలనే మోదీ ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు.