VIDEO: పొన్నూరులో న్యాయవాదులు విధులు బహిష్కరణ
GNTR: సీనియర్ న్యాయవాది చెన్నకేశవులుపై దాడిని నిరసిస్తూ మంగళవారం పొన్నూరులో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాజీ సాహెబ్ మాట్లాడుతూ.. ఒక పక్షం తరఫున వాదించినందుకు దాడి చేయడం హేయమని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, గుమస్తాలు పాల్గొన్నారు.