విద్యుత్ ఉపకేంద్రం ఆకస్మికంగా తనిఖీ
ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రము గుత్తి డివిజనల్ అధికారి పద్మనాభ పిళ్లై ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లో వోల్టేజీ సమస్య లేకుండా గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.