ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం

ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం

అన్నమయ్య: చిన్నమండెం మండలం నడిగడ్డపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా బలపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.