VIDEO: మోస్రాలో ఉపాధి కూలీల ధర్నా
NZB: పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ కూలీలు మోస్రా మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇతర గ్రామాల్లో పనులు జరుగుతుండగా మోస్రాలో పనులు లేకపోవడం అన్యాయమని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.