చిన్న వెంకన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ELR: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ. గోపాల కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి తూర్పు గాలిగోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు, స్వామివారి ప్రసాదాలను శేష వస్త్రాన్ని వారికి సమర్పించారు.