అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు పంపిణీ

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు పంపిణీ

కృష్ణా: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పింఛను అందిస్తుందని కోడూరు మండలం టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కోడూరు మండల పరిధిలో పెన్షన్ దారుల నివాసాలకు వెళ్లి దివ్యాంగులకు, పక్షవాత బాధితులకు, వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేశారు. కొత్తగా 7,872 మందికి 4 వేలు చొప్పున స్పాజ్ పింఛన్లకు 3,15 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు.