యుద్ధం వేళ జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ కీలక ప్రకటన
మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతున్న వేళ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కీలక ప్రకటనను విడుదల చేశాయి. ఈ సందర్భంగా ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఈ యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. ఇరాన్ ప్రతిదాడులను ఆపేందుకు అగ్రరాజ్యానికి సాయం చేయనున్నట్లు ప్రకటించాయి. వెంటనే ఇరాన్ సైనిక చర్యను ఆపాలని లేకపోతే ఆ దేశానికే నష్టం జరుగుతుందని హెచ్చరించాయి.