అసైన్‌డ్ రైతులతో MLA శ్రావణ్ సమావేశం
GNTR: తుళ్లూరు (M) రాయపూడిలో ఆదివారం మండలంలోని అసైన్‌డ్ రైతులతో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ మేరకు అసైన్‌డ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కరిగా ఎమ్మెల్యేకు వివరించారు. క్షుణ్ణంగా సమస్యలను నమోదు చేసుకున్న మంత్రి నారాయణ, CRDA అధికారులు, వీలైతే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.