జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్
WGL: జిల్లాలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు సైతం చలిని లెక్క చేయకుండా తమ బాధ్యతగా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది.