VIDEO: విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో ఉద్రిక్తత
ప్రకాశం: మర్రిపూడి మండలంలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహ ఆవిష్కరణ చేయడాన్ని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు గ్రామంలో పీకెట్ ఏర్పాటు చేశారు. అయితే గతంలో మాజీ మంత్రి విగ్రహ ఏర్పాటుకు నిధులు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.