ఆ నౌకలు తప్ప మిగతా వాటికి అనుమతిస్తాం: ఇరాన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని, లేదంటే విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ స్పందింస్తూ.. 'శత్రు దేశాలకు చెందినవి మినహా అన్ని నౌకలు తమతో సమన్వయం చేసుకుంటూ వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐరాసలోని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌లో ఇరాన్ ప్రతినిధి వెల్లడించారు.