జనవరి నుంచి HPV టీకాలు
NLG: మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.