VIDEO: 29 మంది విద్యార్థులు అస్వస్థత
అల్లూరి జిల్లా జీ.కే.వీధి మండలంలోని జర్రెల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో 29 మంది విద్యార్థులు కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని పాఠశాల సిబ్బంది సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ అయినట్టు వైద్యాధికారి తెలిపారు.