ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ పెట్టకుండ వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో మొత్తం 6 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.