ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు భారీ విరాళం
TPT: నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రమాకాంత్ శెట్టి శనివారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ. 20 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ఎం.రవిచంద్రకు అందజేశారు. అనంతరం టీటీడీ ఈవో దాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.