భారీ చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు మాయం

భారీ చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు మాయం

TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. తాము పనిచేస్తున్న ఇంట్లోనే నేపాల్‌కు చెందిన దంపతులు దొంగతనానికి పాల్పడ్డారు. రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు చోరీ చేశారు. 45 రోజుల క్రితమే వ్యాపారి ఇంట్లో వారు పనిలో చేరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.