రాయదుర్గంలో ఘనంగా బహుజన సంకల్పన

రాయదుర్గంలో ఘనంగా బహుజన సంకల్పన

ATP: రాయదుర్గం మండలంలో బళ్లారి రోడ్‌లోని నేషనల్ ఫంక్షన్ హాల్‌లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు అధ్యక్షతన బహుజన సంకల్పన సభ ఘనంగా జరిగింది. ఈ సభకు రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కాశని నాగరాజు, లాయర్ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.