"లైంగిక వేధింపులకు గురైతే వెంటనే సంప్రదించాలి'

"లైంగిక వేధింపులకు గురైతే వెంటనే సంప్రదించాలి'

మహబూబ్ నగర్: తాము పని చేస్తున్న కార్యాలయాలలో మహిళలు లైంగిక వేధింపులకు గురైతే వెంటనే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఇందిర సూచించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.