VIDEO: భీమేశ్వర ఆలయంలో మంత్రి పూజలు
SRCL: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయమైన భీమేశ్వరస్వామి ఆలయంను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం దర్శించుకున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.