రేపు పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

రేపు పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఆదివారం పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మత్స్య యువజన, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి శుక్రవారం ఆలయ ధర్మకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు మంత్రిని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.