నేడు ప్రజా పాలనలో పాల్గొననున్న Dy.CM భట్టి

KMM: జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను భట్టి విక్రమార్క సందర్శిస్తారు.