కాజీపేట-రామగుండం రైలు మార్గంలో కొత్త ట్రాక్షన్ సబ్‌స్టేషన్
HNK: కాజీపేట-రామగుండం రూట్‌లో రైళ్లకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్త ట్రాక్షన్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రైళ్ల వేగాన్ని భవిష్యత్తులో 150 KM/గం.కు పెంచే అవకాశం ఉండటంతో అధిక లోడును భరించేలా ఈ కొత్త స్టేషన్ రూపొందనుంది. ప్రస్తుత కోమటిపల్లి సబ్‌స్టేషన్ సామర్థ్యాన్ని 25 KV నుంచి మరింత పెంచే ప్రతిపాదనలు రూపొందుతున్నాయి.