రోడ్డు ప్రమాదంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి
KRNL: కోసిగి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. కోసిగి బాలుర హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న కంపాటి నరసింహులు(16) అనే విద్యార్థి సజ్జల గుడ్డం గ్రామం సమీపంలో శుక్రవారం ప్రమాదవశాత్తు బస్సు కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.