ఉరివేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

KNR: తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో ఉరివేసుకుని ఆటో డ్రైవర్ సంతోష్ ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఫైనాన్స్ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు.