జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
HYD: రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతాయనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో HYD జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతాయనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం HYDలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఈ సంఖ్య 22 వరకు చేరవచ్చని ఆశావహ MLA అభ్యర్థులు భావిస్తున్నారు. అలాగే, MPల సంఖ్య పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే, ఇవన్నీ ప్రాథమిక అంచనాలే జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.