VIDEO: భారీ కొండ చిలువ కలకలం
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రిజర్వాయర్ సమీపంలో బుధవారం భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే సాగర్ స్నేక్ సొసైటీ సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని దాదాపు 7 అడుగులకు పైగా ఉన్న కొండచిలువను బంధించారు. అనంతరం దానిని నల్లమల అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.