రేపు మెగా ఆధార్ డ్రైవ్

రేపు మెగా ఆధార్ డ్రైవ్

SKLM: రణస్థలం మండలంలోని కొవ్వాడ మత్సలేశం, సంచాం, నారువ, ఎన్.జి.ఆర్.పురం సచివాలయంలో సోమవారం మెగా ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్రైవ్‌లో చిన్న పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు, బయో మెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.