జిల్లాలో భారీ వర్షం.. 24 గంటల్లో 166 మిల్లీమీటర్

ATP: జిల్లాలో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాలలో రోడ్లన్నీ వర్షపు నీటితో నీట మునిగాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా సుమారు 166 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపింది. దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయిందని పేర్కొంది.