మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి
HYD: కాచిగూడలో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్నేహం పేరుతో నమ్మించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.